కరీంనగర్ జిల్లా ఆలుగునూర్లో మానకొండూర్ నియోజకవర్గ బూత్ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోతే జూన్ 2 తరువాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ప్రమాదముందని తెలిపారు. మాకు మూడో వంతు మెజారిటీ ఇవ్వండి రిజర్వేషన్లు ఎత్తేస్తం అని బీజేపీ వాళ్ళు అంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పని చేసిన బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలని అన్నారు. బండి సంజయ్కు సవాల్ చేస్తున్నా.. ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశావో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
YS Bharathi Reddy: పులివెందులలో వైసీపీ మెజారిటీని ఎవరూ అడ్డుకోలేరు..
బడా భాయి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని కేటీఆర్ ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చోటా భాయ్ రేవంత్ రెడ్డి కూడా అలాగే అబద్ధపు ప్రచారాలు చేశారన్నారు.
ఆలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గుర్తుపట్టరని విమర్శించారు. ఓ డమ్మీ అభ్యర్థిని తీసుకువచ్చి కరీంనగర్ లో పోటీలో పెట్టారు.. బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందని కేటీఆర్ తెలిపారు.
Asaduddin Owaisi: ముస్లింలే ఎక్కువగా కండోమ్‌లను వినియోగిస్తున్నారు..మోడీ వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్..
రాముని పేరు చెప్పుకొని బీజేపీ నాయకులు బండి సంజయ్ ఓట్లు అడుగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న పేద ప్రజలను నమ్మించి మోసం చేశారు మోడీ.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కరోనా సమయంలో తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాల వెళ్ళే కూలీలకు ఫ్రీగా రైళ్లు వేయాలని విజ్ఞప్తి చేస్తే మోడీ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు అక్రమ కేసులు పెడుతారని ఆరోపించారు. నరేంద్ర మోడీని గెలిపించేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.. అందుకే రాహుల్ గాంధీ మాట్లాడేది ఒకటి.. రేవంత్ రెడ్డి మరొకటన్నారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీఆర్ఎస్ గెలిస్తే.. మళ్లీ సంవత్సరం లోపే కేసీఆర్ మళ్ళీ దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతారని కేటీఆర్ చెప్పారు.