Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలి..
- పొన్నం ప్రభాకర్ పై కీలక వ్యాఖ్యలు..
- పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం..
- పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar Mayor: అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. బండి సంజయ్ ఎంపీగా కరీంనగర్ కార్పోరేషన్ అభివృద్ధికి చాలా సహకారం అందించారు. కేంద్రం నుంచి నిధులు విడుదల చేయడం విషయంలో సంజయ్ ఎంపీగా చాలా కృషి చేసారు. నగర అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర చాలా కీలకమైందన్నారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరులో ఆయన సహకారం మరువలేనిదన్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధం లేని మంత్రి నిన్న సమీక్ష చేశారన్నారు. కరీంనగర్ నుంచి ఓటు హక్కుతో సహా ట్రాన్స్ఫర్ చేసుకున్న పొన్నం ప్రభాకర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ సమీక్ష కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లాగా సాగిందన్నారు. కరీంనగర్ కార్పోరేషన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారన్నారు.
Read also: Pawan Kalyan: మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం.. కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు
Also Read
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
మేయర్ కి, ఎమ్మెల్యేలకి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఆహ్వానం లేకుండా సమీక్ష ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తగా పని చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను పిలవకుండా ఎలా సమీక్ష నిర్వహించారని మండిపడ్డారు. పొన్నం హుస్నాబాద్ కి ఎమ్మెల్యే కరీంనగర్ కి కాదన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండగా పొన్నం ఏ హోదాలో సమీక్ష చేశారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేము స్వాగతిస్తాం… వచ్చి సమీక్షలు చేయండి.. సహకరిస్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధి చేసింది మేమన్నారు. పొన్నం కరీంనగర్ నగరానికి ఏమి చేసాడో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ లో రోడ్లు లేవు పదేళ్ళలో అద్భుతమైన రోడ్లు వేశామన్నారు. ప్రజలకు ప్రతీ రోజూ నీళ్లు ఇచ్చాం.. కాంగ్రెస్ వచ్చాక రెండ్రోజులకు ఒక్కసారి కూడా రావడం లేదన్నారు. తనను ఓడించారని కరీంనగర్ నగర ప్రజలపై పొన్నం కసి పెంచుకున్నారని తెలిపారు. అధికారులను బెదిరించే ధోరణిని పొన్నం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sonakshi Sinha Marriage: 20న హల్దీ వేడుక.. 23న పెళ్లి!
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!