Nizamabad MLC Kalvakuntla Kavitha Says Holi Wishes To Telangana People.
హోలి పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో సంతోషంగా జరుపుకుంటారని ఆమె అన్నారు. ఈ హోలీ పండుగలో న్యాచురల్ కలర్స్నే వాడండి అని ఆమె సూచించారు. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నిండు చెరువలు మత్తెడు దునుకుతున్నాయని ఆమె అన్నారు. ఆనందంగా రైతులు, పెద్దలు, యువకులు, మహిళలు అందరూ కూడా పండుగ జరుపుకునే సందర్భంగా ఈ రోజు తెలంగాణలో ఉందన్నారు. ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వరాల జల్లులు కురిపించారన్నారు.
అనేక మంది చిరు ఉద్యోగుల జీవితాల్లో రంగుల నింపడం జరిగిందని, ఆ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. యువ మిత్రులందరికీ కూడా 80 వేల ఉద్యోగాలను సీఎం కేసీఆర్ ప్రకటించారని, అందరూ శ్రద్ద పెట్టి చదవాలని ఆమె సూచించారు. మనం తెలంగాణ తెచ్చుకున్నది పరిపాలన భాగస్వామ్యం కావడానికి అని, అందుకే సీఎం కేసీఆర్ ఆలోచన చేసిన 95 శాతం ఉద్యోగాలు కూడా మన యువకులకే వచ్చే విధంగా ఎంతో మేధోమథనం చేసి అంశాన్ని సాధించడం జరిగిందన్నారు.