ఢిల్లీలోని సారాయ్ రోహిల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది అక్రమంగా నిర్వహిస్తన్న ఆయుధ కర్మాగారాన్ని కనిపెట్టింది. దీనిలో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేయడంతో పాటు.. వారి నుంచి ఫిస్టల్స్ తయారీకీ వాడే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆయుధాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలతో సహా.. ఆయుధ కర్మాగారాన్ని చేధించారు ఢిల్లీలోని రోహిల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది. ముడి పదార్థాలతో పాటుగా భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని.. ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బందియా తెలిపారు. అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ముగ్గురిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. 6 కంట్రీ మేడ్ పిస్టల్స్, 12 స్క్రూ చేయని కంట్రీ మేడ్ పిస్టల్స్, 250 కి పైగా పిస్టల్స్‌కు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని.. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని.. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
https://ntvtelugu.com/news/delhi-sarai-rohi…factory-arrest-3-853773.html