KA Paul: అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓడించండి.. బర్రెలక్క ను గెలిపించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul: అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓడించి బర్రెలక్క ను గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో కేఏ పాల్ ప్రచారం నిర్వహించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపు నిచ్చారు. తమ పార్టీకి సింబల్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. బర్రెలక్కను గెలిపించాలని కోరారు. వేములవాడ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి రమేష్ బాబు ను గెలిపిస్తే వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వేముల వాడ రావడం ఇదే మొదటి సారి అన్నారు. అడుగడుగున అడ్డుకోవడమే కాకుండా.. కేసీఆర్ కుటుంబం కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారని తెలిపారు. ఈ ఎలక్షన్ కమీషన్ ఆర్వోలు బుద్దీబుర్ర లేకుండా చట్టానికి విరుద్దంగా.. మనం అడిగిన రింగు గుర్తు మనకు ఇవ్వకుండా.. వేముల వాడలో పోటీచేస్తున్న వ్యక్తి రమేష్ బాబుకు వాటర్ ట్యాంక్ గుర్తు ఇచ్చారని మండిపడ్డారు.
Read also: Muralidhar Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు నాటకం ఆడుతున్నాయి.. అధికారంలోకి వచ్చేది మేమే
Also Read
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Ponnam Prabhakar: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్.. మహిళలకు రూ.12,171 కోట్లు ఆదా!
- OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
- TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
అయినప్పటి సీరియల్ నెంబర్ 9 వాటర్ ట్యాంక్ కు వేముల వాడ ప్రజలకు ఓటు వేయాలని కోరారు. మీరందరూ రమేష్ బాబును గెలిపిస్తే అసెంబ్లీలో అడుగుపెడతారని అన్నారు. రమేష్ గెలిస్తే.. 6నెలల్లో వేముల వాడలో ఉచిత ఆసుపత్రి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులందరికి కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చి తీరుతానని హామీ ఇచ్చారు. వేములవాడను అభివృద్ది చేస్తానని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన మనకు వద్దని అన్నారు. కుటుంబ పాలన కాంగ్రెస్‌ది మనకు వద్దని అన్నారు. మన బడుగు బలహీల వర్గాల ప్రజాశాంతి పార్టీనే గెలిపించాలని కోరారు. అంతేకాకుండా బర్రెలక్కకి ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. బర్రెలక్కకు తను మద్దతు ఇస్తున్నానని అన్నారు. బర్రెలక్క పోటీచేస్తున్న నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కానీ ఓటు వేయొద్దని అన్నారు. పది సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణను నాసనం చేశారని మండిపడ్డారు.
Indrakaran Reddy: మా నిర్మల్ అభివృద్ధి పట్టదా..? మోడీపై ఇంద్రకరణ్ రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?