TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల అభ్యర్థులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం , తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) విభాగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పెంచిన 7 సంవత్సరాల వయోపరిమితికి అదనంగా ఈ 3 ఏళ్లను కలపడంతో.. మొత్తం 10 సంవత్సరాల వయోసడలింపు లభించినట్లయింది. సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల మధ్య ఉన్న వయోపరిమితి వ్యత్యాసాన్ని సరిచేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కాగా, ప్రభుత్వ తాజా సడలింపులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 34+3 మొత్తం 37 సంవత్సరాలకు చేరింది. గతంలో 7 ఏళ్ల వయో పరిమితి పెంపుతో జనరల్ అభ్యర్థులు 29 ఏళ్ల వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండేది.. ఇప్పుడు తాజా పెంపుతో 32 ఏళ్ల వయస్సు వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎస్సై ఉద్యోగాలకు గతంలో పెంచిన వయో సడలింపు కారణంగా 37 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తాజాగా వీరికి ఎలాంటి పెంపు ఇవ్వలేదు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
దీనికితోడు.. సెప్టెంబర్ 9వ తేదీతో ముగియాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గడువును పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించిన విషయం తెలిసిందే. వయోపరిమితి పెంపు నిర్ణయంతో కొత్తగా వేలాది మంది నిరుద్యోగ యువతకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించడమే కాకుండా, సాంకేతిక ఇబ్బందులు లేకుండా ముగింపు తేదీకి ముందే దరఖాస్తులు పూర్తి చేసుకోవడానికి ఈ గడువు పొడిగింపు ఎంతో దోహదపడుతుంది. అభ్యర్థులు పెంచిన వయోపరిమితి సడలింపులను పరిశీలించి, అధికారిక వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 16లోగా తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!