Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది మరియు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటన చేశారు. ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు లేదా దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొండంత అండగా నిలవాలనే మానవీయ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వంపై గానీ, ఉద్యోగులపై గానీ ఎలాంటి రూపాయి భారం పడకుండా బ్యాంకర్ల భాగస్వామ్యంతో ఈ ప్రమాద బీమాను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మంది లబ్ధి పొందుతున్నారని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, మల్టీపర్పస్ వర్కర్లు, డైలీవేజ్, ఎన్ఆర్ఈజీఎస్, ఎంటీఎస్, సెర్ప్ సిబ్బంది ఉన్నారన్నారు. వీరితో పాటు 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ బీమా ధీమా వర్తిస్తోందని వివరించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 98 క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించి బాధితుల కుటుంబాలకు కోట్ల రూపాయల చెల్లింపులు పూర్తి చేసినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. బీమాతో పాటు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక హెల్త్‌కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని శాసనసభ వేదికగా తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!