K. A. Paul: ప్రార్థించాం.. ఓడించాం.. కర్ణాటకను రక్షించాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K. A. Paul sensational comments on Congress victory in Karnataka: కర్ణాటకలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గత నాలుగు నెలలుగా అనేక సార్లు స్వయంగా వెళ్లి పర్సనల్‌గా బీజేపీ మాజీ ఎంపీ సంగ్లియానాను కలిసామని అన్నారు. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా ప్రజాశాంతి పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ మద్దతుతో జేడీఎస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుపెట్టారని విన్నామని అన్నారు. అక్కడ బీజేపీ పార్టీ, జేడీఎస్ పార్టీని ఓడించాలని ప్రార్థించామని.. అందుకోసం ప్రయత్నించాం.. చివరకు ఓడించి కర్ణాటకను రక్షించామని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పేర్కొన్నారు.
Read also: Lady Harrasment : కుర్రాళ్లు జాగ్రత్త.. ఎంజాయ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆంటీలు
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్‌గా లేదని మనకు తెలుసని తెలిపారు. గత సంవత్సరం 150 కార్పొరేట్ సీట్లలో కాంగ్రెస్ ఒకటి మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. ఇక హుజూరాబాద్‌లో 3లక్షల ఓట్లు పడితే వన్ పర్సెంట్ కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలేదని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులను మల్లురవి, భట్టి విక్రమార్క, హనుమంతరావులను తెలంగాణలో ఓట్లను చీల్చవద్దని పదే పదే అడిగామన్నారు. కానీ పదిలో ఐదుగురు, ఆరుగురు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీని, బీఆర్‌ఎస్ పార్టీని ఓడించాలని చిత్తశుద్దితో కాంగ్రెస్ పని చేయాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు ప్రజాశాంతి పార్టీ ఏ విధంగా మద్దతు ఇచ్చిందో.. అలాగే తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ గెలిచేందుకు కాంగ్రెస్ మద్దతు తెలపాలని ఆయన కోరారు. తెలుగురాష్ర్టాలను రక్షించుకుందామని అన్నారు. బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో చిత్తుగా ఓడించి దేశాన్ని రక్షించుకుందామని కేఏ పాల్ కోరారు.
Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!