Jupally Krishna Rao: కేసీఆర్ మళ్లీ అధికారంలో వస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయం..! జూపల్లి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jupally Krishna Rao: కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. చివరకు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల రక్తాన్ని కేసీఆర్ కుటుంబం కూడా తింటుందని జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని కేసీఆర్ కు అర్థమైందని… అందుకే రెండు చోట్ల పోటీకి సిద్ధమయ్యారని జూపల్లి అన్నారు. కేసీఆర్ ఓటమిని ముందే అంగీకరించారని అన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని… అందుకే కామారెడ్డిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు ఖర్చు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలిచే పరిస్థితి లేదని… కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కడతారని జూపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
Read also: బిడ్డకు తల్లిపాలు ఎప్పుడు.. ఎలా మాన్పించాలి..?
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
లేనిపక్షంలో బీఆర్ ఎస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇప్పుడు వాగ్దానాలు చేస్తున్న కేసీఆర్.. గెలిచాక వాటిని మర్చిపోయే రకం అని అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని జూపల్లి అన్నారు. మంత్రి హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుమల సాక్షిగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తిరుగుబాటు చేశారని జూపల్లి అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా తాండూరు టికెట్ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరూ తమ సత్తా చాటేలా కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని జూపల్లి సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదాల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని… అయితే ఇది ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి నిదర్శనమని జూపల్లి అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి కేసీఆర్‌ను ఓడించడం ఖాయమన్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి, అక్రమాలన్నీ బయటపడతాయన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!