Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పూర్తిగా సన్నాహాలు చేపట్టబడ్డాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,365గా ఉంది, అందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా.. ఇతరులు 25 మంది ఉన్నారు.
నియోజకవర్గంలో ముగ్గురు అబ్జర్వర్స్ పర్యటన చేసి ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈసారి ప్రతి బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఏర్పాటు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేయబడుతుందని, అలాగే ఓటర్లకు మొబైల్ తీసుకెళ్ళకూడదని, మొబైల్ డిపాజిట్ చేయాల్సిందని స్పష్టం చేశారు ఆర్వీ కర్ణన్.
Kurnool Bus Fire : మెదక్ జిల్లాకు చెందిన తల్లి-కూతురు దుర్మరణం
స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే ఓటర్ స్లిప్పులు పంచుతారని, రాజకీయ పార్టీలు వాటిని పంచితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో 15 FST, 15 SST టీమ్స్ తిరిగి ఎలక్షన్ కోడ్ అమలు చేస్తున్నట్లు, మద్యం సీజ్, నగదు నిర్వహణ, సోషల్ మీడియా పర్యవేక్షణ వంటి చర్యలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు, 512 లీటర్ల మద్యం సీజ్ అయ్యిందని, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
ఓటింగ్ పెంచేందుకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దివ్యాంగులు, గర్భవతులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వెహికిల్స్ అందిస్తారని, ఈనెల 27న పారా మిలిటరీ బలగాలు నియోజకవర్గంలో వస్తాయన్నారు. 8 కంపెనీలు ముఖ్యమైన పోలింగ్ స్టేషన్లలో విధుల్లో ఉంటాయన్నారు. 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ బందోబస్తులో 16 వందల మంది పాల్గొంటున్నారని, అవసరమైతే మరింత మంది కూడా విధుల్లోకి తీసుకోబడతారని ఆయన తెలిపారు.
Bharat Taxi: ఓలా, ఉబర్‌లకు సవాల్.. మొదలుకానున్న ‘‘భారత్ టాక్సీ’’