కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో మెదక్ జిల్లా శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి–కూతురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతులు సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23)గా గుర్తించారు. గత కొన్నేళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. భర్త వేణు దుబాయ్‌లో పనిచేస్తుండగా, కుమారుడు వల్లభ్ అలహాబాద్‌లో చదువుకుంటున్నాడు. కుమార్తె చందన బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
Bharat Taxi: ఓలా, ఉబర్‌లకు సవాల్.. మొదలుకానున్న ‘‘భారత్ టాక్సీ’’
అయితే.. దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా స్వస్థలమైన శివాయిపల్లికి వచ్చారు. పండుగ అనంతరం వేణు దుబాయ్‌కి తిరిగి వెళ్లగా, కుమారుడు వల్లభ్ కూడా అలహాబాద్‌కి వెళ్లిపోయాడు. నిన్న చందనను బెంగళూరులో దింపి, తాను దుబాయ్ వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో సంధ్యారాణి ఈ దుర్ఘటనకు గురయ్యారు. కర్నూలు వద్ద బస్సు మంటల్లో చిక్కుకోవడంతో తల్లి–కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ వార్త తెలిసి శివాయిపల్లి గ్రామంలో విషాదం అలముకుంది. గ్రామస్తులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబంలోని ఇద్దరిని కోల్పోయిన వేణు, వల్లభ్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Minister Seethakka : నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు