గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో చిన్నారుల కోసం రోడ్ సేఫ్టీ సమ్మర్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. అయితే క్యాంప్‌లో పాల్గొన్న నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. 6 రోజులు పాటు గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చిన్నారుల కోసం రోడ్ సేఫ్టీ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఈ సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఎంతగానో దోహద పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన సూచించారు. చిన్నారులు సైతం రోడ్డు ప్రమాదాలపై అవగాహనతో ఉండాలన్నారు. చిన్నారులు వారి వారి పేరెంట్స్ కు అలాగే వారి కుటుంబ సభ్యులకు సైతం చెప్పండి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని, రోడ్డు ప్రమాదాల నివారణ కొసం చిన్నప్పటి నుండి అవగాహన కలిగి ఉండాలి. చిన్నారులు చదువులతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవగాహన అవసరమని ఆయన వెల్లడించారు.