MLC Jeevan Reddy: ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ తమిళిసై కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పీఆర్టీ టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఉపాధ్యాయ సంఘ నాయకులుతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గుదలకి కారణమన్నారు. కేజీ టు పీ జీ ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా.. క్రమబద్ధీకరణ నెపంతో పాఠశాలలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు విద్యను దూరం చేశారని, ఓపీఎస్ విధానం అమలుకి విధాన పరమైన నిర్ణయం చేపడుతామన్నారు. 317 జోనల్ విధానం అమలుతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జోనల్ విధానాన్ని సమీక్షించి, ఉమ్మడి జిల్లాలప్రాతిపదికన జోన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు.
Read also: KTR: సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేది..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
శాసన మండలిలో జోనల్ విధానం పై సమీక్షించాలన్నారు. పాఠశాలలో స్కావెంజర్ ను తొలగించడంతో ఉపాద్యాయులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా ముందస్తుగా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని తెలిపారు. నియామకాలలోలేని టెట్ ను పదోన్నతుల్లో ప్రవేశపెట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల ప్రతినిధిగా సమస్యల పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తాని హామీ ఇచ్చారు. గవర్నర్ టీఎస్పీఎస్ సభ్యుల రాజీనామా ఆమోదించడం జాప్యం తో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గవర్నర్ చొరవ చూపీ, ఉద్యోగ నియామకాల భర్తీ ప్రకియకు మార్గం సుగమం చేయాలని జీవన్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. సమస్యలను లేవనేత్తడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేసే బాధ్యత తీసుకుంటా అని తెలిపారు.
Lok Sabha Elections : ఇండియా కూటమితో వెళ్లలా.. వద్దా.. తేల్చి చెప్పనున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!