Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..
- కాంగ్రెస్‌కు షాక్… బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి
- రేవంత్ నాయకత్వంపై ఘాటు విమర్శలు
- కేసీఆర్ పాలనపై ప్రశంసలు… మార్పు అవసరమన్న వ్యాఖ్యలు
- కేటీఆర్ సమక్షంలో చేరికకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్ధండ పిండం, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత ఇమేజ్‌కే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. “రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పార్టీకి ఉండాల్సిన అసలైన గుర్తింపును రేవంత్ లాగేసుకున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ మార్క్ ఎక్కడా కనిపించడం లేదు, కేవలం రేవంత్ హవా మాత్రమే కనిపిస్తోంది” అని ఆయన మండిపడ్డారు. పార్టీలో తాను తీవ్రమైన అసంతృప్తికి, ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అలుపెరగని పోరాటం చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే పార్టీ గూటికి చేరడం వెనుక ఉన్న బలమైన కారణాన్ని వివరించారు. “బీఆర్ఎస్ పాలన కంటే మెరుగైన అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ఇస్తుందని ప్రజలతో పాటు నేనూ ఆశించాను. కానీ రేవంత్ రెడ్డి పాలనను ప్రత్యక్షంగా చూశాక, గత కేసీఆర్ ప్రభుత్వమే ఎంతో మేలు అనే అభిప్రాయానికి వచ్చాను. రెండున్నరేళ్ల రేవంత్ పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి” అని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ఉన్న స్పష్టత, అనుభవం ఇప్పుడు లోపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ నాయకుడు తీసుకున్న ఈ నిర్ణయంపై జగిత్యాల ప్రజల స్పందన ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆయన ధీటుగా సమాధానమిచ్చారు. కేవలం తాను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలంతా ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తాను అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరే విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్ , పార్టీ హైకమాండ్ నిర్ణయానికి లోబడి ఉంటానని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక అగ్రనేత, రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బీఆర్ఎస్‌లో చేరడం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!