ICC: టెస్ట్ క్రికెట్‌కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
- ఐసీసీ సమావేశంలో క్రికెట్ గ్లోబలైజేషన్‌పై కీలక నిర్ణయాలు
- ఒలింపిక్స్ 2028లో క్రికెట్ చేరికతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
- ప్రస్తుత WTC ఫార్మాట్‌పై అసంతృప్తి వ్యక్తం
- 2027 జూలై నుంచి WTCను 9 జట్ల నుంచి 12 జట్ల లీగ్‌గా మార్చే ప్రతిపాదన
- ఐర్లాండ్, అఫ్గానిస్తాన్, జింబాబ్వేలకు అవకాశం కల్పించే యోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC: అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఐసీసీ (ICC) కీలక మార్పులకు సిద్ధమవుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించిన త్రైమాసిక సమావేశంలో ఐసీసీతో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (CEC) కూడా భారీ నిర్ణయాల అమలుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు పరిమిత దేశాల్లో మాత్రమే ప్రాచుర్యం పొందిన క్రికెట్ ను ఇకపై గ్లోబల్ స్పోర్ట్ గా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంలా కనిపిస్తోంది.
TPCC Mahesh Goud : జీవన్ రెడ్డికి అన్ని ఇచ్చింది కాంగ్రెస్సే.. ఆధారాలు ఉంటే గాంధీ భవన్‌కు రండి
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ప్రత్యేకంగా ఒలింపిక్స్ లో క్రికెట్ ఉండడం ఇప్పుడు ఈ క్రీడకు పెద్ద ప్లస్. లాస్ ఏంజెల్స్ వేదికగా ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ను 34 క్రీడలతో పాటు చేర్చారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల చొప్పున పోటీలు నిర్వహించి అందులో బంగారు, వెండి, కాంస్య పతకాలను అందించనున్నారు. దీనితో క్రికెట్‌కు గ్లోబల్ గా మరింత గుర్తింపు లభించే అవకాశముంది. ఇక మరోవైపు, టెస్ట్ క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ప్రస్తుతం కొంత ప్రాధాన్యం కోల్పోతున్నట్టు ఐసీసీ భావిస్తోంది. దీంతో WTC ఫార్మాట్‌లో మార్పులు చేయాలని ఐసీసీ ఆలోచిస్తోంది.
ప్రస్తుతం 9 దేశాలతో జరుగుతున్న WTCను 2027 జూలై నుంచి 12 జట్ల లీగ్ గా మార్చాలనే యోచనలో ఐసీసీ ఉంది. ఇందులో ఇప్పటికే ఉన్న భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు ఐర్లాండ్, అఫ్గానిస్తాన్, జింబాబ్వేలను చేర్చే ప్రతిపాదన ఉంది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. టాప్ జట్లకు, దిగువ ర్యాంక్ జట్లకు మధ్య ఇప్పటికే ఉన్న అంతరం మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే
లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ 2028లో పాల్గొనే ఆరు జట్ల ఎంపిక విధానంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. హోస్ట్ గా ఉన్న అమెరికా ఆటోమేటిక్‌గా అర్హత సాధించనుండగా.. మిగిలిన ఐదు జట్లు ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతీయ ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేయబడే అవకాశం ఉంది. చివరి స్థానం కోసం 2027లో గ్లోబల్ క్వాలిఫయర్ నిర్వహించే ఆలోచనలో ఉంది.
ప్రస్తుత విధానంలో ప్రతి జట్టు రెండు ఏళ్ల సమయంలో ఆరు దేశాలతో (3 హోమ్, 3 అవే) సిరీస్‌లు ఆడుతుంది. పాయింట్ల శాతాన్ని ఆధారంగా తీసుకుని టాప్ రెండు జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. అయితే ఈ విధానంలో సమతుల్యత కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. దీనికి పరిష్కారంగా రెండు స్థాయిల (two-tier system) లీగ్ ను ప్రవేశపెట్టాలని కొందరు సూచించినప్పటికీ, కొన్ని దేశాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!