Swarnalatha Bhavishyavani: రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 9.40 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. ఈ సందర్భంగా.. స్వర్ణలత … భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది.. నాకు కావాల్సిన పూజలన్ని అందిస్తున్నారు. బోనం నాకు ఎవరు తెచ్చిన నాకు ఆనందమే అన్నారు. పాడి పంటలు, వానలు సంవృద్ధిగా ఉన్నాయి, కోరినన్ని అన్ని వర్షాలు కురుస్తున్నాయి అని తెలిపారు. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా? అని ప్రశ్నించారు. ఏమి తెచ్చిన నేను ఆనందంగా తీసుకుంటా.. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకుంటా. నా రూపాన్ని పెట్టండి.. నారూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా అన్నారు. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగ పడుతున్నారు.
Read also: Madhyapradesh : పాపం.. మల విసర్జనకని బయటికి పోతే.. కొండచిలువ పట్టేసుకుంది
ఐదు వారాలు పప్పు బెల్లం పలహాలతోటి సాక పెట్టండి రా.. అన్నారు. రోగాలతో బాధపడుతున్న వారికి మీ చల్లటి చూపుకై నేను వారికి అండగా వుంటాను. మించిన ఔషదాలు తగ్గించుకుని, పాడిపంటలు సంవృద్ధి చేసినట్లైతే తప్పకుండా రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. నాకు రక్తపాసం ఇవ్వట్లేదని తెలిపారు. మీకు నచ్చినట్లు ఇస్తున్నారు.. దాంతోనే నేను సంతోషంగానే వున్నానని తెలిపారు. పూజలందూ సంతోషంగా వుండాలి, గర్భస్త్రీలకైనా, బాలలు కూడా ఎటుంవంటి ఆటంకం కాకుండా చూసుకుంటా.. అంటూ స్వర్ణలత (జోగిని) భవిష్యవాణిలో తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు.
NEET UG 2024: నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..