Site icon NTV Telugu

Jairam Ramesh: టీఆర్ఎస్‌.. బీఆర్‌ఎస్‌ కాదు.. వారికి వీఆర్ఎస్‌ తప్పదు..

Jairam Ramesh Kcr

Jairam Ramesh Kcr

టీఆర్‌ఎస్‌ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. వరుసగా రెండోసార్లు అధికారాన్ని చేపట్టిన కేసీఆర్‌.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై గురిపెట్టారు.. రేపే జాతీయ పార్టీ పేరు.. జెండా, అజెండా ఖరారు చేస్తారని తెలుస్తోంది.. గులాబీ బాస్‌ పెట్టబోయే జాతీయ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌ అని ప్రచారంలో ఉంది.. అయితే, కేసీఆర్‌ జాతీయ పార్టీపై స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్… హాట్‌ కామెంట్లు చేశారు.. టీఆర్ఎస్‌.. బీఆర్ఎస్ కాదు.. అసలు టీఆర్ఎస్‌కు వీఆర్ఎస్‌ తప్పదంటూ వ్యాఖ్యానించారు జైరాం రమేష్.. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్‌కి రానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన.. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.. ఇక, మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ప్రకటించారు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.. మరి, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు, ఏపీకి చెందిన వెంకయ్యనాయుడు దీనిపై ఏం చేశారంటూ నిలదీశారు.. ఇక, రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌ పైనేనని స్పష్టం చేశారు జైరాం రమేష్‌.

Read Also: Ramakrishna: అమరావతిపై మంత్రి ధర్మాన.. అధర్మంగా మాట్లాడుతున్నారు..!

ఇక, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుంది.. కాంగ్రెస్‌కు భారత్‌ జోడో యాత్ర సంజీవని అని వ్యాఖ్యానించారు జైరాం రమేష్‌.. ఈ నెల 18న కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి రాహుల్‌ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. 85 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్‌ యాత్ర కొనసాగుతుంది… నాలుగు రోజుల పాటు రోజుకు 21 కిలోమీటర్ల మేర ఏపీలో యాత్ర సాగనుందని.. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణకు వెళ్తుందని వెల్లడించారు. మరోవైపు, బీజేపీ, మిత్రపక్షాలు భారత్‌ జోడో యాత్రపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు జైరాం రమేష్‌… 3,570 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర చేస్తారు.. 120 మంది భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు… అందులో మూడో వంతు మహిళలు వున్నారని వెల్లడించారు.

Exit mobile version