Jagadish Reddy: ఎమ్మెల్సీ కవిత కేస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు.. ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా చోట్ల పొలాలు ఎండి పోతున్నాయన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్ఎండీ అడ్డు చెప్పినా మేము పొలాలకు నీళ్లు ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్ళడానికి మంత్రుల కు లాగులు తడుస్తున్నాయన్నారు.
Read also: BRS KTR: యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతాం.. కేటీఆర్ వార్నింగ్..!
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సోయి లేకుండా ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీ కి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అండర్ స్టాండింగ్ తో అభ్యర్థులను పెడుతున్నారని తెలిపారు. ప్రజల్లో బలం లేని ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో కవిత ను విచారణ చేసి, ఏమి తేలలేదు అని చెప్పారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కవిత ను అరెస్ట్ చేశారన్నారు. కవిత కేస్ పై కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారని, ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని కీలక వ్యాక్యలు చేశారు.
Harish Rao: మన సీఎంకు.. మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు..!