Site icon NTV Telugu

Jagadish Reddy : అధికారుల ఎప్పుడూ అందుబాటులో ఉండాలి..

Jagadish Reddy

Jagadish Reddy

గత ఐదు రోజులుగా తెలంగాణ లో భారీ వర్షాలకు రుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణకు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు అధికారులు. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నెలకొన్ని పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా.. ఎప్పుడూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు, గ్రామల మధ్య ఉన్న రోడ్లు వరద నీటికి తెగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులతో టచ్‌లో ఉండాలని, ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇబ్బందులుకు పడుతున్న ప్రజలు కంట్రోల్‌ రూంకి కాల్‌ చేసి సహాయం పొందాలని జగదీష్ రెడ్డి సూచించారు.

 

Exit mobile version