K. Laxman: కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ. ఈనేపథ్యంలో.. Airport లో ఏర్పాట్లను బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా.. బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బీజేపీ తరఫున కోరుతున్నామన్నారు. సమాఖ్య స్పూర్తిని మోడీ గౌరవిస్తున్నారని అన్నారు. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. 25 వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంద లక్ష్మణ్ తెలిపారు. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారని,ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు.
read also: Vijay Devarakonda : ఆ నొప్పినుంచి పూర్తిగా కోలుకున్నా..
గతంలో రైతులు ఎరువుల కోసం బారులుదీరేవారు. బ్లాక్ దందా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చెప్పులు క్యూలో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. రాజకీయాలు వేరు.. ప్రభుత్వాలు వేరు.. అని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నా మోడీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. చేనేతపై జీఎస్టీ కౌన్సిల్ లో పాల్గొని అప్పుడు ఒకే చెప్పి ఇప్పుడు బురదజల్లడం సరికాదని మండిపడ్డారు. ఈవిషయంలో హరీష్ రావు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులకు బీమా ఎందుకు ఇవ్వట్లేదు? అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరిట పోస్టల్ కార్డులు విడుదల చేశామన్నారు. మీరు వారిని అవమానించారని అన్నారు. అలాంటిది మోడీ పర్యటనను అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనాలని అన్నారు. Airport లో కార్యకర్తలతో మాత్రమే మీటింగ్ ఉంటుందని అన్నారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ ను చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలని సంచళన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో దగ్గరుండి అభివృద్ధి చేయమని మోడీని అడగాల్సింది పోయి రాకుండా ఉండటం సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ నిర్ణయాలు తెలంగాణకే నష్టమని ఆరోపించారు.
Allu Arjun: రియల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కేరళ నర్సింగ్ విద్యార్థిని దత్తత!