Ponguleti: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: పాలేరు మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ సోదాలు జరిగాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు 8 వాహనాల్లో వచ్చారు. ఇది జరుగుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల క్రితమే చెప్పారు. ఖమ్మంలోని పొంగులేటి ఇంటి కార్యాలయాలను తనిఖీ చేస్తున్న ఐటీ శాఖ అధికారులు. పొంగులేటి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో పొంగులేటి కుటుంబ సభ్యులంతా ఖమ్మంలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు వారందరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి రాఘవ్ కన్‌స్ట్రక్షన్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరాడు. అయితే తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో పొంగులేటి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో తనపై కూడా ఐటీ దాడులు జరుగుతాయని పొంగులేటి రెండు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే జరుగుతుంది.పాలేరు, హైదరాబాద్‌లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసాలపై ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డింగ్స్‌లోని ఆయన నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..