Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ క్యాన్సర్ చికిత్స సేవల నెట్వర్క్ ఒమేగా హాస్పిటల్స్పై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు మెరుపు దాడులకు దిగారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లోని ఒమేగా ఆసుపత్రి శాఖలతో పాటు యాజమాన్యానికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని ఒమేగా హాస్పిటల్స్ శాఖల్లో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ బ్లాకులు, ఫైనాన్స్ విభాగాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
Also Read
- Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు..
- CM Revanth Reddy: "భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు".. సుప్రీం తీర్పుపై రేవంత్రెడ్డి హర్షం
- Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
- Hyderabad: నిమ్స్ ఆస్పత్రిలో ముగిసిన ఏసీబీ సోదాలు.. అర్ధరాత్రి వరకు తనిఖీలు
ఆసుపత్రి బ్రాంచీలతో పాటు పలువురు కీలక వైద్యులు, యాజమాన్య ప్రతినిధుల ఇళ్లపై కూడా ఐటీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు, అనధికార నగదు లావాదేవీలు జరిగినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల రికార్డులు, డిజిటల్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు అకౌంట్స్ బుక్స్, హాస్పిటల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ డేటాను పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతుండటంతో వైద్య రంగ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఐటీ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!