హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు (Hyderabad Drugs Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ కేస్ లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త కృష్ణ కిషోర్ రెడ్డి తో పాటు ప్రముఖ డీజే మైరాన్ మోహిత్ ని అరెస్ట్ చేశారు. ప్రముఖ హీరోయిన్ భర్తనే మైరాన్ మోహిత్. టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్. 12 ఏళ్ల నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడు మైరాన్. ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్ గా ఉన్నాడు మైరాన్. దేశవ్యాప్తంగా డీజేలు నిర్వహించడంలో మైరాన్ దిట్టగా పేరుంది. వంద మందికి పైగా డీజేలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మైరాన్.
గోవాతో పాటు దేశవ్యాప్తంగా డీజేలను ఆర్గనైజ్ చేస్తున్నాడు. డీజేలో మాటున డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్. గోవా డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఎడ్విన్ తో మైరాన్ కు పరిచయాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ముంబై, గోవా, బెంగళూరు హైదరాబాదులోని పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్..50 మందికి పైగా డ్రగ్ పెడ్లర్స్ తో అతనికి కీలక సంబంధాలున్నాయి. డబ్బుతో పాటు సన్ బర్న్ లో జరిగే పార్టీలకు డ్రగ్ సరఫరా చేస్తుంటాడు మైరాన్. టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు వ్యాపారవేత్తలతో అతనికి లింకులు వున్నాయి.
ముంబైలో మకాం వేసి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు మైరాన్. టాలీవుడ్ నటి నేహా దేశ్‌పాండే ను వివాహం చేసుకున్నాడు మైరాన్. అతని కాంటాక్ట్ లిస్ట్ ను వెలికి తీస్తున్నారు పోలీసులు. మైరాన్ తో పాటు కృష్ణ కిషోర్ ని తిరిగి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. గత కొంతకాలం నుంచి కృష్ణ కిషోర్ తో పరిచయాలు పెంచుకున్నాడు మైరాన్. బెంగళూరు గోవా మీదుగా హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పిస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి. సూపర్ లగ్జరీ బస్సులో పార్సెల్ రూపంలో డ్రగ్స్ ని తీసుకువస్తున్నాడు కృష్ణ కిషోర్ రెడ్డి.
ఎడ్విన్, మైరాన్ తో కొంతకాలం నుంచి పరిచయాలు పెంచుకున్న కృష్ణ కిషోర్ రెడ్డి వారి సాయంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. తను వ్యాపారవేత్తలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కె ఎం సి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డి. ప్రముఖ బిల్లర్ గా కొనసాగుతున్న కృష్ణ కిషోర్ రెడ్డి కార్యకలాపాలపై నిఘా వేశారు. తెలంగాణ ఏపీలో కాంటాక్టులు నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డిపై నిఘా పెంచారు. దర్యాప్తు ముమ్మరం చేస్తే మరిన్ని సంగతులు బయటకు వస్తాయంటున్నారు.
Read Also: Sanjay Bangar: సచిన్‌ను విరాట్ కోహ్లీ దాటేస్తాడు.. ఇది పక్కా..!!