మొన్న విడుదలైన ఇంటర్మీడియేట్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు బలైన విద్యార్థుల న్యాయం కోసం NSUI పోరాడుతుంటే ఇంటర్మీడియేట్ బోర్డు కనీసం స్పందించకుండా,పోలీసులను అడ్డం పెట్టుకోని మమ్మల్ని అడ్డుకోవడం వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడంలో భాగమేనని NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ మండిపడ్డారు. ఈ రోజు ఇంటర్మీడియేట్ బోర్డులో అధికారులను కలిసేందుకు వెళ్ళిన NSUI బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.విద్యార్థుల ప్రాణాలకు బాధ్యులైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు తీరుకు నిరసనగా డిసెంబర్ 20వ…