Indrakaran Reddy: విద్యారంగంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakaran Reddy: నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. మన ఊరు-మన బడి’ పాఠశాల, నూతనంగా నిర్మించిన రాంనగర్, సోఫినగర్ పాఠాశాలను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీయం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద్భుతమైన ఫలితాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారయని తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా మారుతున్నదని పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యాదినోత్సవం సందర్భంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో నిర్మల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన రాంనగర్, సోఫినగర్ పాఠాశాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
Read also: Karnataka High Court: శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. భర్తపై కేసు కొట్టివేత..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రగతిబాటలో ముందుకు సాగుతున్నదని, తొమ్మిదేళ్ళలో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యా బోధన, మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామీణులకు, పేదలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ.. మరోపక్క సంక్షేమశాఖలవారీగా కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ సత్ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు రూ. 140 కోట్లతో రెండు జతల యూనిఫామ్స్, రూ. 190 కోట్లతో ఉచితంగా టెక్స్ట్ బుక్స్, సంవత్సరం పొడవునా రూ. 35 కోట్ల ఖర్చుతో రాగి జావా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారని పేర్కొన్నారు. 12 లక్షల 50 వేల మంది విద్యార్థులకు రూ. 56 కోట్ల విలువ గల నోట్ బుక్స్, 34.25 కోట్ల విలువ చేసే ట్యాబ్స్ 19,800 మంది టీచర్స్‌కు అందించనున్నామని వెల్లడించారు.
Weight Loss Tips: రాత్రి పడుకునే ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే బరువు పెరగడం ఖాయం!
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?