కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…