అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ వేల మంది అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టషన్ లో ఉదయం ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకువచ్చారు. రైళ్లకు నిప్పు పెట్టారు. కట్టెలు, రాడ్లు, రాళ్లతో అక్కడి షాపులపై దాడులు చేశారు. పోలీసుల కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు.
ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు
దీంతో (శనివారం) నేడు అల్లర్లు జరగకుండా మందస్తు చర్యగా జంటనగరాల్లో తిరిగే ఎం.ఎం.టి .యస్ సర్వీసులను రెండు రోజులు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈరోజు కూడా సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన ప్రకటన వెల్లడించారు. సికింద్రాబాద్ వద్ద పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేపట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో 300 మంది అభ్యర్థులనువచ్చినట్లు, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు. ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం వుందని వెల్లడించారు.