NTV Telugu Site icon

Independence Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

Telagnana Stete

Telagnana Stete

Independence Day: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.

Read also: Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..

ఖమ్మం జిల్లాలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎగురవేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఖమ్మం జిల్లాలో 1,11,818 ఎకరాల నాగార్జునసాగర్ స్థిరీకరణ జరగనుందని భట్టి విక్రమార్క తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 33 వసతి గృహాలు ఉన్నాయన్నారు.
ఖమ్మం జిల్లాలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి రాష్ట్రంలోనే ఖమ్మం నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చామన్నారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కరించేందుకు కాల్ సెంటర్ వాట్సాప్ ఫేస్బుక్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. నాలుగు గోడలు నలుగురు మనుషుల మధ్య చట్ట రూపకల్పన చేయకుండా ప్రజామోదం ద్వారానే చట్టాలని చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

కరీంనగర్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు.

భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జాతీయ జెండాను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఎగురవేశారు

సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి.

మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది నెలల్లో తెలంగాణ లో ప్రజా పాలన ఎంతో బాగుంది ? అని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల నుంచే ప్రారంభించామన్నారు. రైతులకు రూ 2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు.

Read also:IMD Weathter: నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్..

సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎగురవేశారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

జనగామ జిల్లా 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జనగామ డీసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్.

ములుగు జిల్లాలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి సీతక్క. జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జాతీయ జెండాను మంత్రి సీతక్క ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి.

వరంగల్ లో78వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని ఖిలావరంగల్ కోటలో ఖుష్ మహల్ వద్ద జాతీయ పతాకాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read also: Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.

ల్గొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, కలెక్టర్ సి. నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలోఎంపీ చామల కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , కలెక్టర్ హనుమంతు కె జండగే,డిసిపి రాజేష్ చంద్ర పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.

నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగ జరిగాయి. జాతీయ జెండాను మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.

Read also: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..

హనుమకొండ జిల్లాలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మువ్వన్నెల జెండాను అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించారు.

కరీంనగర్ లోని తెలంగాణ భవన్ లో 88వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగమే భారత దేశ స్వాతంత్రం వారిని స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి కరీంనగర్ జిల్లా నుండి తెలంగాణ సాధన కొరకు కరీంనగర్ జిల్లా ముఖచిత్రంగా ఉందని ఈ సందర్భంగా భారతదేశ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఆనాడు స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేయడంతో , నేడు దేశవ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నారని సినీ నటుడు ,పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ బేగంబజార్ లో భగత్ సింగ్ యువ సేన రాష్ట్ర అధ్యక్షుడు లడ్డు యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బ్రహ్మానందం మాట్లాడుతూ…. సంక్రాంతి , రంజాన్ , క్రిస్మస్ పండుగలు ఎలానో , స్వాతంత్ర దినోత్సవం కూడా భారతీయులకు ఒక పండుగ అని అన్నారు.

తెలంగాణవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో అంబేద్కర్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ భవన్‌లోనూ స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకున్న ఆయన.. వారికి ఘన నివాళులర్పించారు.
Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..