Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musi Riverfront Project: హైదరాబాద్ నగర ప్రతిష్ఠాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టు తొలి దశలో చేపట్టనున్న పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ వ్యయాన్ని మినహాయించి ఈ నిధులతో ప్రాధాన్య కారిడార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ప్రాజెక్టు కింద మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య స్ట్రెచ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి.మీ. పరిధిలో రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను జోన్-1A, జోన్-1B కారిడార్లలో అమలు చేయనున్నారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లో రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) రుణంగా అందించనుంది. మిగిలిన రూ.2,845.12 కోట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రుణాల ద్వారా సమకూర్చనున్నాయి.
Also Read
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులను EPC (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కంస్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకానికి కూడా ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు, కొనుగోలు ప్రక్రియ మొత్తం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ప్రాజెక్టు అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతంగా చేపట్టాలని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL)ను ఆదేశించింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!