Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో విభేదాల చర్చ.. మాజీమంత్రిపై మంత్రి ఫిర్యాదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి విభేదాల చర్చ మొదలైంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య వివాదం మళ్లీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. తాజాగా మంత్రి కొండా సురేఖ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్‌తో భేటీ సందర్భంగా కడియం శ్రీహరి జిల్లా రాజకీయాల్లో తనను లక్ష్యంగా చేసుకుని వ్యవహరిస్తున్నారని, మహిళా మంత్రిగా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆమె సందర్బంగా విజ్ఞప్తి చేశారు.
మంత్రి సురేఖ విజ్ఞప్తిపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈ వివాదాన్ని పార్టీ స్థాయిలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకుని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు సమాచారం. కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, బహిరంగ విమర్శలు చేసుకోవడం వరకు వ్యవహారం వెళ్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించారు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
ఆ తర్వాత నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో జరిగిన విందు సమావేశానికి కొండా సురేఖ హాజరై తమ మధ్య విభేదాలు లేవని, కేవలం అభిప్రాయ భేదాలే ఉన్నాయని ప్రకటించారు. జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా కడియం శ్రీహరి మనవరాలి హాఫ్ సారీ వేడుకకు కూడా కొండా సురేఖ హాజరై కలిసి ఫొటోలు దిగడంతో ఇరువర్గాల మధ్య వివాదం ముగిసిందని అంతా భావించారు.
తాజా వివాదానికి కారణమేంటి?
అయితే ఇటీవల కడియం శ్రీహరి తన నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి, వాటి సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించడం కొత్త వివాదానికి దారితీసినట్లు సమాచారం. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను సమర్పించాలని అధికారులను కోరినట్లు సమాచారం మంత్రి సురేఖ దృష్టికి వెళ్లినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించడం వరకు సమంజసమే అయినప్పటికీ.. మొత్తం జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అధికారులకు సూచనలు ఇవ్వడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని మంత్రి సురేఖ భావించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పార్టీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రికి కూడా ఆమె లేఖ రాశారు.
కడియం శ్రీహరి వివరణ:
ఈ ఆరోపణలపై స్పందించిన కడియం శ్రీహరి మాత్రం తాను కేవలం తన నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి అంశాలపైనే అధికారులతో చర్చించానని తెలిపారు. జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ఫిర్యాదు చేశారనే ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేస్తూ, అది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే అయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!