Nirmal: నర్సాపూర్ కేజీబీవీ విద్యార్థుల అస్వస్థత ఘటన.. భాద్యులపై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) లోని కేజీబీవీలో శుక్రవారం రాత్రి భోజనం చేసి 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరికి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన మౌనిక, వినంతి, ఆరాధ్యలను నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం పరిశీలించారు.
సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ ట్యాంక్‌పై కవర్ లేకపోవడంతో వెంటనే బిగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మిషన్ భగీరథ ట్యాంకు వద్దకు వెళ్లి నీటిని పరిశీలించారు. విద్యార్థులు తాగుతున్న మినరల్ వాటర్, వంటకు ఉపయోగించే బోర్ వాటర్ శాంపిల్స్ సేకరించారు. మిషన్ భగీరథ ట్యాంక్ వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీణలను ఆదేశించారు.
Also Read
Read also: Haryana: ఘోరం.. శ్మశానం గోడ కూలి నలుగురి మృతి.. వీడియో వైరల్
ముగ్గురిపై వేటు..
నిర్మల్ జిల్లా నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనకు కారకులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. విధులలో నిర్లక్ష్యం, ఘటనకు బాధ్యులు అయిన విద్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సహాయ వంట మనుషుల తొలగించినట్లు వెల్లడించారు. ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యా శాఖా కార్యాలయం లో పని చేస్తున్న జెండర్ కోఆర్డినేటర్ ను మాతృ శాఖకు రిలీవ్ చేశామని, మూడవ తేదీన జరిగిన ఘటనకు బాధ్యులుగా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, ప్రధాన వంట మనిషిని టెర్మినేట్ చేసామని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జ్యోతి, అనూష, ఉమ సహాయక వంట మనుషులను విధుల నుంచి తొలగిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. నర్సాపూర్ కేజీబీవీ ప్రత్యేక అధికారికి షోకాజ్ నోటీసులు అందించారు. ఇక నుంచి కేజీబీవీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు పలువురు అధికారులను తాత్కాలికంగా నియమించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!