ఈ ఏడాది వర్షాలు దండికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంచి వర్షాలే కురిసాయి.. ఇక, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో.. మునుపెన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతుండగా.. ఏకంగా 45 ఏళ్ల తర్వాత ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకుతుంది.. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్రమంగా పెద్ద చెరువులోకి వర్షంనీరు వస్తుంది.. ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నం చెరువులోకి వస్తాయి వర్షం నీరు.. మొదట ఆకులమైలారం చెరువు నుంచి ప్రారంభమయ్యే వరద.. గుమ్మడవెల్లి.. ఎలిమినేడు మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు చేరుతుంది.. మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది.. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో 40 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత అలుగు పారడం ప్రారంభమైంది..
Read Also: Special Story on Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..
ఓవైపు పెద్ద చెరువు.. మరోవైపు.. చిన్న చెరువు రెండూ కలిసిపోయి.. నిండుకుండల్లా మారాయి.. దీంతో ఆ అందాలను చూసేందుకు తరలివస్తున్నారు సందర్శకులు.. 45 ఏళ్ల తర్వాత అలుగు పారడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.. మరోవైపు.. పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో అక్కడి నుంచి చేపలు బయటకు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేశారు మత్స్యకారులు.. ఇబ్రహీంపట్నం నుంచి ఉప్పరిగూడ, పోచారం గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.. ఇక, అలుగు దూకి కిందకు నీరు వెళ్తుండడంతో.. శేరిగూడ సమీపంలో సాగర్ రహదారిపై నుంచి వర్షం నీరు ప్రవహిస్తోంది.. ఇది మరింత పెరిగితే సాగర్ రహదారిపై రాకపోకలు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.. ఉప్పరిగూడ వద్ద ప్రస్తుతం పెద్ద చెరువు అలుగు మూడు ఫీట్ల పేర ప్రవహిస్తుండగా.. అలుగు వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు క్యామ మల్లేష్ ఇతర నేతలు పాల్గొన్నారు.. మరోఎవైపు.. కాంగ్రెస్, సీపీఎం.. సహా ఇతర పార్టీల నేతలు అలుగును సందర్శించారు.. క్రమంగా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది..
పెద్ద చెరువు అందాలు.. అలుగు దూకే ప్రాంతానికి వెళ్తున్న సందర్శకులు.. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.. కాగా, ఇబ్రహీంపట్నం సమీపంలో 1550 – 1580 మధ్య కాలంలో ఇబ్రహీం కుతుబ్ షా.. ఈ చెరువును నిర్మించారు.. నిజాం పాలనలో ప్లాన్ చేసి, నిర్మించిన చివరి ట్యాంక్‌లో ఇది ఒకటి. ఇది మూడంతస్తుల నిర్మాణం, సరస్సు బెడ్‌కి దారితీసే మెట్లు ఉన్నాయి. లోపలి నుండి మెట్లు కూడా ఉన్నాయి, దానితో గదులు ఉన్నాయి. ప్రధాన రహదారి స్థాయిలో ఉన్న పై అంతస్తు, బహుశా గాలిని పట్టుకోవడానికి మరియు నీటిని చూడటానికి ఒక ప్రదేశంగా ఉపయోగించబడింది. గోడ యొక్క ఒక వైపున అనేక గూళ్లు ఉన్నాయి, బహుశా వెలిగించిన దీపాలను ఉంచడానికి ఉపయోగిస్తారు. కుతుబ్ షాహీ శైలిలో గార పని అన్ని చోట్ల ఉంది, మరియు పక్షులు మరియు జంతువులను గోడ బ్రాకెట్లుగా ఉపయోగిస్తారు. ఇబ్రహం బాషా దర్గా అని పిలువబడే పెద్ద ట్యాంక్ సమీపంలో ఒక ప్రసిద్ధ దర్గా ఉంది, చాలా మంది ముస్లింలు ప్రతి శుక్రవారం నమాజ్‌లో పాల్గొంటారు. ఇక, కట్ట మైసమ్మ దేవాలయానికి నిత్యం భక్తుల తాకిడి ఉంటుంది.. గతంలో పెద్దచెరువు కట్టమీదుగా హైదరాబాద్ వైపు రాకపోకలు సాగించేవారు.. ఇప్పుడు కట్టకింది నుంచి మరోరోడ్డు వేయడంతో.. ప్రమాణం మరింత సులువుగా మారింది.. ఇబ్రహీంపట్నం చెరువు సుమారు 1209.28 ఎకరాలను కలిగి ఉంది. 1993లో మొదటిసారిగా, 2000లో మళ్లీ నిండినా.. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని తాకలేదు..
ఇక, ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కింది 1209.28 ఎకరాల ఆయకట్టులో ఉంది. ఫిరంగి నాలా పొడవు 85 కిలోమీటర్లు కాగా.. ఇది ఇబ్రహీంపట్నం పెద్ద ట్యాంక్‌కు ఫీడర్ ఛానల్, ఇది ఇబ్రహీంపట్నం మండలంలో 16 కి.మీ పొడవుతో చేవెళ్ల మండలం చందనవెల్లి గ్రామం దగ్గర మూసీ నది నుండి మళ్లించబడుతుంది. మిషన్ కాకతీయ ఫేజ్-2 కింద ఇబ్రహీంపట్నం మండలంలో 16 కిలోమీటర్ల మేర ఫిరంగి నాలా పునరుద్ధరణ చేపట్టారు. ఫిరంగి నాలా ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు ప్రధాన నీటి వనరుగా ఉంది, ఇది దాని మార్గంలో ఆక్రమణల కారణంగా సంవత్సరాలుగా ఎండిపోయింది. పెద్ద చెరువులో నీరు ఉంటే.. ఆయకట్టుకేకాదు.. భూగర్బ జలాలు పెరిగి.. సమీపంలోని చాలా గ్రామాల్లో బావులు, బోర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తంగా.. 45 ఏళ్ల తర్వాత పెద్ద చెరువు అలుగు దూకడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు, మత్స్యకారులు, స్థానికులు..