ఈ ఏడాది వర్షాలు దండికొడుతున్నాయి.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంచి వర్షాలే కురిసాయి.. ఇక, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో.. మునుపెన్నడూ లేని విధంగా చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతుండగా.. ఏకంగా 45 ఏళ్ల తర్వాత ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు దుంకుతుంది.. గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్రమంగా పెద్ద చెరువులోకి వర్షంనీరు…