HYDRA : హైడ్రాకు అదనంగా రూ.69 కోట్లు విడుదల
- హైడ్రాకు అదనంగా రూ.69 కోట్లు.. ప్రభుత్వ ఉత్తర్వులు
- జీహెచ్ఎంసీ నుంచి రూ.20 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్స్
- పెండింగ్ వేతనాలకు ఊరట.. ఉద్యోగుల సంతోషం
- ఆధునిక పరికరాలతో విపత్తు నిర్వహణ మరింత బలోపేతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ మొత్తం రూ.69 కోట్లు హైడ్రాకు మంజూరు చేశారు. ముఖ్యంగా ఈ నిధులు బడ్జెట్‌లో ముందస్తుగా కేటాయించబడకపోయినా, అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
ఇది కాకుండా, హైడ్రాలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద మరో రూ.20 కోట్లు హైడ్రాకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తాజా నిధుల విడుదలతో పెండింగ్‌లో ఉన్న వేతనాలను క్లియర్ చేయడానికి మార్గం సుగమం అవుతుందని సంబంధిత అధికారులు స్పష్టంచేశారు.
Also Read
- Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
- Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
- CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
- El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
హైడ్రా విపత్తు నిర్వహణలోనే కాకుండా వర్షాకాలం, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి అనుకోని పరిస్థితుల్లో ముందుండి సహాయ చర్యలు చేపడుతుంది. అలాంటి సందర్భాల్లో రిస్క్ తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు చాలా కాలంగా వేతనాలు అందక నిరాశలో ఉన్నారు. ఈ కొత్త నిధుల మంజూరుతో వారి సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభించనుంది. అదనపు నిధుల మంజూరుతో హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆధునిక పరికరాలు, రక్షణ సామాగ్రి కొనుగోలు చేయడంలో ఈ నిధులు ఉపయోగపడతాయి. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో హైడ్రా వేగవంతంగా స్పందించగలదు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో విపత్తు నిర్వహణకు ఎప్పటికప్పుడు నిధులు, సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన రూ.69 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన రూ.20 కోట్ల గ్రాంట్ కలిపి హైడ్రా పనితీరుకు పెద్ద మద్దతుగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!