Hyderabad Biryani: హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేది బిర్యానీ.. అసలు బిర్యానీ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. ఇక్కడ దొరకని బిర్యానీ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వారం తో పనిలేకుండా బిర్యానీ అనగానే లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉంటారు. ఇక హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్ లోనైనా బిర్యానీ కి పేరు పెట్టనవసరం లేదు అని చూసి చూడకుండా తినేస్తున్నారా..? అయితే ఆగండాగండి.. ఏది తిన్నా ఇప్పుడు చూసుకోవాలమ్మా. ఎందుకంటే ఇటీవల ఫుడ్ సేఫ్టీని పాటించని చాలా హోటల్స్ ఎలా పడితే అలా వండేస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లిన ఒక వ్యక్తికి షాకింగ్ ఘటన ఎదురయ్యింది. నారాయణ గూడలో బిర్యానీ రెస్టారెంట్స్ కు కొదువ లేదు. ఆ హోటల్ కూడా ఫుల్ ఫేమస్.. సరే బాగా ఆకలిగా ఉందని ఒక వ్యక్తి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. వేడివేడిగా పొగలు కక్కుతూ బిర్యానీ వచ్చింది.
ఇంకేముంది తినేద్దాం అని మొదలుపెట్టేలోపు అతనికి ఎందుకో బిర్యానీలో ఏదో తేడా కొడుతుందని అనిపించి.. తేరిపార చూడగా బిర్యానీలో పురుగులు తిరుగుతూ కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సదురు వ్యక్తి వెంటనే సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక హోటల్ యాజమాన్యం సైతం తప్పు తమదే అని, అనుకోకుండా జరిగిందని సర్దిచెప్పడానికి ట్రై చేశారు. అది మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని, ఇలాంటివి ముందు ముందు జరగకూడదని సదురు వ్యక్తి పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇకముందు ఏ రెస్టారెంట్ కు వెళ్లినా తినేముందు ఒక్కసారి ఫుడ్ ను చెక్ చేసి తినడం అలవాటు చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.