* నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్.. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ ఆదేశం.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు రావాలని కేటీఆర్ కి సూచన..
* నేడు ఉదయం 9 గంటలకి తెలంగాణ భవన్ కి కేటీఆర్.. ఉదయం 10 గంటలకి మీడియాతో మాట్లాడనున్న కేటీఆర్.. అనంతరం సిట్ ఆఫీస్ కి వెళ్లనున్న కేటీఆర్..
* నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.. హుజూర్ నగర్ లో ప్రభుత్వ వ్యవసాయ కాలేజీతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న గవర్నర్.. కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్ కుమార్..
* నేటి నుంచి మేడారంలో హెలికాఫ్టర్ సేవలు.. ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించే అవకాశం.. జాయ్ రైడ్ సేవలను ప్రారంభించనున్న మంత్రి సీతక్క.. జాయ్ రైడ్ కు ఒకరికి రూ. 5 వేల చార్జ్ వసూలు.. హనుమకొండ నుంచి మేడారానికి రూ. 35,999..
* నేడు దావోస్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు.. ఉదయం 8: 25కు హైదరాబాద్ రానున్న చంద్రబాబు.. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్లనున్న చంద్రబాబు.. ఉదయం 10: 30కి గన్నవరం చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడి నుంచి 11: 30కి సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
* నేడు వెలిగొండ ప్రాజెక్టు పనులు, ఏర్పాట్లను పర్యవేక్షించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు..
* నేడు అమరావతి రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ఈ-లాటరీ విధానంలో గతంలో మాదిరిగానే ప్లాట్ల కేటాయింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన సీఆర్డీఏ.. మొత్తం 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ప్లాట్ల కేటాయింపు..
* నేటితో ముగియనున్న ఏపీ కల్తీ మద్యం తయారీ కేసులో నిందితుల రిమాండ్.. ఇవాళ కోర్టులో జోగి రమేశ్ తో పాటు నిందితులను హాజరుపర్చనున్న పోలీసులు..
* నేడు ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ.. లిక్కర్ కేసులో ఈడీ ముందుకు మిథున్ రెడ్డి.. మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్న ఈడీ అధికారులు..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం
* నేడు బాసర సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వసంత పంచమి సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ప్రత్యేక అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు..
* నేడు తెలంగాణకు తొలి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్.. చర్లపల్లి- తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు.. తిరువనంతపురం నుంచి ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
* నేడు తమిళనాడులో అన్నాడీఎంకే- ఎన్డీయే కూటమి సభ.. చెన్నై శివారులో భారీ బహిరంగ సభ.. బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..
* నేడు కేరళలో కాంగ్రెస్ నాయకుల కీలక సమావేశం.. మీటింగ్ లో పాల్గొననున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ..
* నేడు రష్యా- ఉక్రెయిన్- అమెరికా తొలి త్రైపాక్షిక భేటీ.. యూఏఈ వేదికగా మూడు దేశాల ప్రతినిధుల సమావేశం..
* నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20.. రాత్రి 7 గంటల నుంచి రాయ్ పూర్ వేదికగా మ్యాచ్.. 5 మ్యాచుల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్..