Bandi Sanjay: సిసోడియాకి మేం బెయిల్ ఇచ్చామా..? కవితకు ఇవ్వడానికి..
- కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం?..
- సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధముందా?..
- కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం?.. సిసోడియాకు బెయిల్ వస్తే… బీజేపీకి సంబంధముందా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్డడం సరికాదని.. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందన్నారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసన్నారు. నాతోసహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించిన, జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు ఫేక్ న్యూస్ అని తెలిపారు. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకూ నేటికీ పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కొమ్ముకాసిన ఐఏఎస్ లకే మళ్లీ మంచి పోస్టింగులిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Maheshwar Reddy: కొడంగల్ పనులు మేఘా కృష్ణతో ఒప్పందం.. అందుకే సుంకి శాలపై స్పందన లేదు..
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చురగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ఏ.. అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు. పంచాయతీలకు నిధులిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సహక నిధులివ్వడం లేదని మండిపడ్డారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని తెలిపారు. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీలు అభివృద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని అన్నారు. పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోందని నిధుహరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామం అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందని తెలిపారు. తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం సరికాదని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ లో లుకలుకలు మొదలైనయ్ అన్నారు. ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజలు ఐదేళ్ల తీర్పు ఇచ్చారని తెలిపారు. ఐదేళ్లు అధికారాన్ని ఉంచుకుంటారా? వదులుకుంటారా? అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉందని అన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలున్న మాట వాస్తవమే కదా… ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రిబ్బన్ కటింగ్ చేశారు కదా? అని గుర్తించారు.
Read also: Malla Reddy University: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..
అసదుద్దీన్ ఒవైసీ.. ఎన్ని వక్ప్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. ఒకచోట ఊరు ఊరంతా వక్ఫ్ బోర్డు భూములేనని చెప్పడం ఎంత వరకు న్యాయం? అని అన్నారు. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంత మంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా? అని ప్రశ్నలను సందించారు. ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డులో ఉన్నాయి… పూర్తి విచారణ చేస్తే వివరాలు బయటకొస్తాయన్నారు. గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే… వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. నేను అందరి మనిషిని… కొందరు కాదనుకుంటే నేనేం చేయగలను అన్నారు. పార్టీకి, శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదన్నారు. నా పార్లమెంట్ పరిధిలో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తా అని అన్నారు. రాష్ట్ర అధ్యక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్దా చూసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
Bhatti Vikramarka: వారానికి ఒకసారి నివేదిక పంపండి.. చీఫ్ ఇంజనీర్లకు భట్టి విక్రమార్క ఆదేశం..
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!