NTV Telugu Site icon

CM Revanth Reddy: ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే..!

Revanth

Revanth

CM Revanth Reddy: తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 9 నెలల పాటు విజయవంతంగా 547 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. పరేడ్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అన్నారు. మా ప్రభుత్వం 30 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది.. మరో 35 వేల ఉద్యోగాలను ఈ ఏడాది చివరిలోగా ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశాం.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. కొందరు వ్యసాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.. గంజాయి, డ్రగ్స్ పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. ఇది ఉద్యోగం మాత్రమే కాదు.. ఒక భావోద్వేగం.. ఏ సమస్య వచ్చినా.. బాధ్యతలు నిర్వహించేది పోలీసులే అన్నారు. మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మనదే అని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్, వరంగల్ లో పోలీసుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం.. ఒక్కో స్కూల్ 50 ఎకరాల్లో నిర్మిస్తాం.. పోలీసుల పిల్లలకు 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read Also: Suicide Attempt: సూసైడ్‌ చేసుకోవడానికి వచ్చి రైలు పట్టాలపై నిద్ర పోయిన యువతి..(వీడియో)

కబ్జాదారులకు సీఎం రేవంత్ వార్నింగ్..
ఇక, చెరువులు, నాలాలు, కుంటలు కబ్జాదారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టం.. కబ్జా చేసిన వాళ్లు మీకు మీరుగా ఖాళీ చేసి వెళ్లిపోండి.. లేదంటే మా హైడ్రా రంగంలోకి దిగితే అన్ని నేలమట్టం అయిపోతాయని హెచ్చరించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారు.. ఫామ్ హౌస్ లలోని డ్రైనేజీ నీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో కలుపుతున్నారు.. చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి.. దుర్మార్గులు చెరువుల్ని ఆక్రమించడం వల్లనే వరదలు వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేసే బాధ్యత మాదే.. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడుతామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.

Read Also: Deputy CM Pawan Kalyan: ఏలేరు వరద ఉధృతి.. కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫోన్..

అయితే, ప్రభుత్వ భూములు, చెరువులలో కబ్జాలు చేసిన వారిని సహించేది లేదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన వారికి రెగ్యులరైజ్ కాదు.. ఎప్పటికైనా ఆ నిర్మాణాలను కూల్చివేయాల్సిందే.. భావితరాలకు అందజేయాల్సిన చెరువులను, కుంటలను కబ్జాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ పరిసరా ప్రాంతాల్లో నిర్మించిన ఫాంహౌస్ లు, గెస్ట్ హౌస్ డ్రైనేజీ వీటిల్లో కలిపి వేస్తున్నారు.. ఆ వాటర్ ను నగరవాసులకు మంచినీరుగా అందిస్తున్నాము.. ఇలాంటి ఫామ్ హౌస్ లను ఉంచాల్నా, కూల్చాల్నా మీరే చెప్పండి అని అడిగారు. కాస్మోటిక్ కి పోలీస్ కాదు కాంక్రీటు పోలీస్ గా ప్రతి ఒక్కరి విధి నిర్వహణ ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.