Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. నగరంలో తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్ కోసం అధికారులు జంక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే.. బీహెచ్‌ఈఎల్ క్రాస్ రోడ్డు వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జంక్షన్ పనులు చేపడుతున్నారు.
ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుంది..
* O&M డివిజన్ నెం.6: అమీర్ పేట్, SR నగర్, ఎర్రగడ్డ
* O&M డివిజన్ నెం.8: ఆఫ్ టేక్ పాయింట్లు, ఈ డివిజన్ కింద బల్క్ కనెక్షన్లు
* O&M డివిజన్ నెం.9: KPHB కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట
* O&M డివిజన్ నెం.15: ఆర్‌సిపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్
* O&M డివిజన్ నెం.24: బీరంగూడ, అమీన్‌పూర్
పైన పేర్కొన్న ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వాటర్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు. 30 ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఆగస్టు 19 ఉదయం నుంచి 20 మధ్యాహ్నం వరకు నీటిని నిలిపి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మరమ్మతు పనులు చేపడుతున్నందున హైదరాబాద్‌లోని చాలా చోట్ల 30 గంటల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పత్రికా ప్రకటన ప్రకారం, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కెడిడబ్ల్యుఎస్‌పి) ఫేజ్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా పైప్‌లైన్ మరమ్మతు పనుల మధ్య ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మరమ్మతులు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బాలాపూర్, మేకలమండి, మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Shankar: ఈయన కమర్షియల్ సినిమాలకి గేమ్ ఛేంజర్