CLP Meeting: నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
- నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
- సాయంత్రం 4గంటలకు మాదాపూర లోని ట్రెడెంట్ హోటల్లో భేటీ..
- స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్న సీఎల్పీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
మండల స్థాయి నుంచి కొత్త కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం ఏర్పరచడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. పార్టీ బాధ్యతలతో పాటు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కొత్త కమిటీ ఏర్పాటు బాధ్యతలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను భారీ సంఖ్యలో గెలిపించేందుకు కార్యాచరణ రూపొందించే అంశంపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
Musi River: మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు.. నేటి నుంచి షురూ..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!