Hyderabad: బైక్ పై అబ్బాయి ఒడిలోనే అమ్మాయి.. హద్దులు దాటి ముద్దులు..
- యువత ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి..
- బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలు..
- పాతబస్తీలోని పహాడీషరీఫ్ వద్ద ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: యువత ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. బైకుల పైన అమ్మాయిలను ఎక్కించుకుని నడిరోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిపై ఓ జంట బైక్ నడుపుతూ కెమెరాకు చిక్కారు. చుట్టుపక్కల ఎవరూ లేరనుకున్నారో.. లేక మరేదో లోకంలో విహరిస్తున్నారో తెలియదు కానీ, రోడ్డుపై ఉన్నామనే ధ్యాసే లేకుండా ప్రవర్తించారు. బైక్ నడుపుతున్న అబ్బాయి ఒడిలో అమ్మాయి కూర్చుని నడిరోడ్డుపై హద్దులు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు. ఇది చూసి అక్కడున్న వారు సిగ్గుతో తల దించుకోక తప్పలేదు. ఈ సమాజానికి ఏమైంది? ఇలాంటి వికృత చేష్టలపై సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో వెళ్తున్నారని అడగకుండా పంపడం సరికాదు. ఇలాంటి ఘటనలతో రేపు చిన్నారులు పెద్ద ప్రమాదాలకు గురయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది జంటలు నడిరోడ్డుపై బైక్‌లు నడుపుతూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీరి కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వాహనం నంబర్ ఆధారంగా వేలాది సీసీ కెమెరాలను పోలీసులు స్కానింగ్ చేస్తున్నారు. ఇలా ప్రవర్తిస్తున్న యువతను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటి దుష్ప్రవర్తనకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ, ఇంట్లో తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!