Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం యువత ఎంతకైనా తెగిస్తోంది. గుర్తింపు కోసమో.. లేదంటే ఇంకేదైనా గొప్ప కోసమో తెలియదు గానీ.. ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బీహార్‌లో ఓ యువకుడు చేసిన స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.