Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. విద్యార్థి సంఘాల నుంచి విపక్షాల వరకు వరుస ఆందోళనలతో ఢిల్లీని రణరంగంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో శాంతి భద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి. జంతర్ మంతర్ వేదికగా ఎప్పుడు ఎవరు ఆందోళనలకు పిలుపునిస్తారో అంతుపట్టకపోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైగా ఢిల్లీ పోలీసులను జులై 21 నాటి చేదు అనుభవవాలు కూడా వెంటాడుతున్నాయ్.
కొన్ని నెలలుగా ప్రతి రోజూ దేశ రాజధానిలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. వాస్తవానికి జంతర్ మంతర్ వేదికగా సంవత్సరం పొడువునా ఢిల్లీలో ఏదో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అయితే నీట్ ఉద్యమం తర్వాత పరిస్థితి మారిపోయింది. జంతర్ మంతర్ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారిపోయింది. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. జంతర్ మంతర్ వేదికగా మొదలైన ఈ నిరసనలు సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా విస్తరించాయి.
Also Read
అక్టోబర్ 2న జంతర్ మంతర్ వద్ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. నాలుగు రోజుల్లోనే ఈ ఆందోళనలు సెంట్రల్ ఢిల్లీ అంతటా వ్యాపించాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ పలు గ్రూపులు మార్చ్ చేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు వరుసపెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. విద్యార్థి సంఘాలు, రాజకీయ నేతలు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు గుంపులుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. ఎనిమిది పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు పారామిలటరీ బలగాలను భారీగా మోహరించారు.
జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేపినా… ఎటునుంచి ఎటు కదులుతున్నారో తెలియని గుంపులను నియంత్రించడం కష్టంగా మారింది. బారికేడ్లను దాటుకుని వచ్చే వారిని అడ్డుకోవడం, అరెస్టులు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఆందోళనకారులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేస్తుండటం పరిస్థితిని మరింత జటిలం చేస్తోంది. కేవలం ఒక్క ప్రదేశానికి పరిమితం కాకుండా నిరసనకారులు సెంట్రల్ ఢిల్లీలోని నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేసి… వేరే ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెడితే… కొన్ని గంటల్లోనే జంతర్ మంతర్ చేరుకుని మళ్లీ ఆందోళనలు మొదలు పెడుతున్నారు.
ఈ ఆందోళనల కవరేజ్ సమయంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. దీంతో వారి ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు, కెమెరా ఉండటంతో ఎవరు జర్నలిస్టులో… ఎవరు ఆందోేళనకారులో గుర్తించడం కూడా పోలీసులకు సవాల్ గానే మారింది. నిరసనకారులకు దూరంగా ఉంటూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సాధ్యం కావడం లేదు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీకి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలివచ్చే అవకాశముండటంతో ఢిల్లీ పోలీసులు తలపట్టుకున్నారు.
పోలీసులు ఇంత అప్రమత్తంగా వ్యవహరించడానికి జూలైలో జరిగిన నిరసనలే ప్రధాన కారణం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసింది. అప్పట్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లకుండా రెండో దఫా కూడా ఆందోళనలకు దిగారు. ఆ పార్టీకి మద్దతుగా వచ్చే వారి సంఖ్యను అంచనా వేయడంలో అప్పట్లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. అందుకే ఈసారి నిరసనకారులను జంతర్ మంతర్ దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
జూలై ఆందోళనల తర్వాత ఢిల్లీ పోలీసులకు యాంటీ-ప్రొటెస్ట్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిరసనకారులతో వ్యవహరించేటప్పుడు సంయమనం, ఓపిక పాటించాలని ఉన్నతాధికారులు సూచించారు. గ్రౌండ్ లెవల్లో ఏం జరుగుతుందో ఉన్నతాధికారులు తెలుసుకునేందుకు వీలుగా… జంతర్ మంతర్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు బాడీ కెమెరాలను పెట్టుకుంటున్నారు. ప్రస్తుత ఆందోళనల్లో చాలా తక్కువ మంది పోలీసులు మాత్రమే లాఠీలతో కనిపిస్తున్నారు. పారామిలటరీ బలగాలు మాత్రం టియర్ గ్యాస్ షెల్స్‌ను పట్టుకుని డ్యూటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!