BRS Meeting: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని జిల్లా నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనేపథ్యంలో మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం బయలుదేరింది. అయితే ఇవాళ గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి వెళతానని అక్కడే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం కూడా చేసి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి, కేసీఆర్ వద్దకు తీసుకుని వెళతానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం గాంధీ నివాసంలో బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది.
Read also: Manipur Violence : పోలీసు పోస్టుకు 200 మీటర్ల దూరంలో జిరిబామ్‌లోని పీహెచ్‌సీకి నిప్పు
కాగా, ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, గాంధీల మధ్య సవాళ్లతో గాంధీ అనుచరులు గురువారం కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట బైఠాయించిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలైన హరీష్రావు, గంగుల కమలాకర్, వావిరాజు రవిచంద్ర తదితరులను పోలీసులు కేసంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ నాయకులను కేశంపేట పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు విడుదల చేశారు.
Modi- Biden: ఈ నెల 21న ప్రధాని మోడీ- జో బైడెన్ కీలక భేటీ..