PCC Chief Mahesh Goud: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన ఏ కులం అనేది క్లారిటీ ఇవ్వాలి? అని డిమాండ్ చేశారు. ముదిరాజా లేక రెడ్డి నా అనేది.. బీజేపీలో పదవులు రాలేదని మాపై అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. ఈటల అంటే నాకు కొంచెం గౌరవం ఉండేది.. కేసీఆర్, ఈటల వల్లనే కదా రాష్ట్రం అప్పుల పాలైంది అని ఆరోపించారు. నువ్వు భూములు కబ్జా చేయలేదా? కేసులు లేవా? అని అడిగారు. నీ హయంలోనే కదా భూములు కబ్జా అయ్యింది.. బీజేపీలో ఈటల ఇమడలేక పోతున్నారు.. కేసీఆర్ వైపు ఈటల చూస్తున్నట్టు ఉంది ఆయన మాటలు చూస్తుంటే.. సీనియర్ నాయకుడివి… సీఎం మీద అట్లా మాట్లాడొచ్చా?.. మీ భాష అక్షేపణీయం.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నారు అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Read Also: India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?
ఇక, ఈటల రాజేందర్ సంస్కారవంతంగా మాట్లాడాలి కదా? అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కేసీఆర్ అలీబాబా 420 టీంలో నువ్వు ఒక మెంబర్ వే అని ఆరోపించారు. కేటీఆర్ లాగే మాట్లాడుతున్నాడు ఈటల.. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి, ఈటల కాదా?.. బీసీ అని చెప్పుకుంటారు మీరు… కానీ మిమ్మల్ని ఎవరు బీసీ బిడ్డలుగా గుర్తించడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన కేంద్రం వద్దకు ఎందుకు తీసుకు వెళ్లలేదని అడిగారు. ఒక్క ముదిరాజ్ బిడ్డని అయినా రాజకీయంగా ఎదగనిచ్చారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పండి సరిదిద్దుకుంటాం.. కానీ, భాష, పద్ధతి మార్చుకో అని ఈటల రాజేందర్ కు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
