Ameenpur Tragedy: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను కూడ ఆత్మహత్యయత్నం చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటనలో ముగ్గురు పిల్లుల చనిపోయారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహిళ రజిత.. అయితే, రజిత భర్త చెన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాద ఘటనపై ఎన్టీవీతో రజిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి అని పేర్కొన్నారు. అయితే, చెన్నయ్య, రజితను కొట్టినప్పుడల్లా మా ఇంటికి వచ్చేది.. అక్కడికి వచ్చి మళ్లీ చెన్నయ్యే నేనే కొట్టాను నాదే తప్పు అని చెప్పేవాడు.. కానీ ఈ మధ్య గొడవ జరిగినప్పుడు మాత్రం ఇద్దరూ సీరియస్ అయ్యారు అని రజిత తల్లిదండ్రులు పేర్కొన్నారు.
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
అయితే, ఈ సారి గొడవ జరిగితే నేనే ముగ్గురు పిల్లలను చంపుతానని చెన్నయ్య అన్నాడని రజిత తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. రజిత కూడా ముగ్గురు పిల్లలు చంపి నేను చచ్చిపోతానని చెప్పింది.. కానీ, పిల్లలను చంపడం ఏంటో తెలియట్లేదు.. భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చినా ఏం కాకపోతుండే.. నా బిడ్డ రజిత చచ్చిపోయిన పీడా పోయేది అని వారు పేర్కొన్నారు.. అనవసరంగా నా ముగ్గురు మనవాళ్లను చంపింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, రాఘవేంద్ర కాలనీ నుండి ముగ్గురు చిన్నారుల డెడ్ బాడీలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి పోలీసులు తరలించారు.