Site icon NTV Telugu

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టితో త్రిమెన్ కమిటీ భేటీ.. ఉద్యోగుల సమస్యలపై ఆరా

Bhatti

Bhatti

Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈరోజు ( మే 27వ తేదీ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో త్రిమెన్ కమిటీ అధికారుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎంకు వారు వివరించారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు త్రిమెన్ కమిటీ అధికారులు వివరించారు.

Read Also: Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల

అయితే, ఈ నెల 29వ తేదీన సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని సబ్ కమిటీ భేటీలో వివరించాలని అధికారుల కమిటీకి డిప్యూటీ సీఎం సూచనలు చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాలని చెప్పుకొచ్చారు. రాష్ట్ర కీర్తి ప్రతిబింబించేలా విజయోత్సవాలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

Exit mobile version