High Court: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరైనవి కావని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఫిర్యాదుదారుడు నాగవెల్లి లింగమూర్తికి నోటీసులు జారీ చేశారు.
Read also: Naini Rajender Reddy: వారికి జాతకాల పిచ్చి ఉంది.. హరీష్ రావుకు నాయిని రాజేందర్ కౌంటర్
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిన ఘటనపై భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా.. తాజాగా ఆ నోటీసులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం జనవరి (2025)7వ తేదీకి వాయిదా వేసింది.కాగా, మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీశ్ రావు, తదితరులని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
Read also: Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..
అయితే ఈ అంశం తమ పరిధిలోకి రాదని మేజిస్ట్రేట్ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో రాజలింగమూర్తి జిల్లా కోర్టును ఆశ్రయించి రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన భూపాలపల్లి జిల్లా కోర్టు కేసీఆర్, హరీశ్ రావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. కాగా.. రివిజన్ పిటిషన్‌ను స్వీకరించే అధికారం భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
Mallu Bhatti Vikramarka: అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి..