నేటి నుంచి జీఎస్టీ 2.o అమల్లోకి రానుంది.. ఇవాళ్టి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు అమలు చేస్తున్నారు.. దీంతో, పలు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి.. జీఎస్టీ కౌన్సిల్ 2025 సెప్టెంబర్ 3న చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు ప్రధాన పన్ను స్లాబులు 5 శాతం, 18 శాతం మాత్రమే ఉంటాయి. అదనంగా, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నారు.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఇద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..
కొన్నిసార్లు నిద్ర లేకపోయినా లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనా కూడా కొంతమందికి విపరీతమైన తల నొప్పి వస్తుంది..ఇలా ఎక్కువగా తల నొప్పి వస్తుంటే అది జన్యుపరమైన తలనొప్పిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..తలనొప్పి వల్ల విపరీతమైన చిరాకు, కోపం, అసహనం కలుగుతాయి. ఒక్కోసారి తలనొప్పి విపరీతంగా ఉంటే కొంత మందికి వాంతులు కూడా అవుతాయి. అయితే తలనొప్పికి భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూంటారు. అలా ట్యాబ్లెట్స్ వేసుకున్నా.. ప్రమాదం ఉందండోయ్. అలా కాకుండా ముందుగా కొన్ని టిప్స్ పాటిస్తే తలనొప్పికి…
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాల కేటాయింపు వ్యవహారం కొంత కాలంగా న్యాయపరమైన వివాదంగా మారింది. ఆర్ 5 జోన్ ఏర్పాటు పైన స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా…