Allu Arjun Silent: చిక్కడపల్లి పోలీస్టేషన్ లో గంటన్నరగా అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. అల్లు అర్జున్ లాయర్ అశోక్ సమక్షంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీసీపీ, ఏసీపీ, ఇన్స్‌పెక్టర్ సహా ఎస్సైలతో కలిపి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. సంధ్యా థియేటర్ వద్ద శ్రీతేజ్, రేవతికి సీపీఆర్ చేసిన పోలీసులతో సహా అల్లు అర్జున్ ను విచారణ కొనసాగుతుంది. దాదాపు 50 ప్రశ్నలతో కూడినటు వంటి ప్రశ్నలను అల్లు అర్జున్‌ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది.
Read also: GST : రూ.6 లక్షల విలువైన పాత కారును రూ.లక్షకు అమ్మినా రూ.90 వేలు జీఎస్టీ కట్టాల్సిందేనా?
ముందుగా సంధ్యా థియేటర్ కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ సరైన సమాధానం చప్పలేదు. తాను ఒక సాధారణ ప్రేక్షకునిగానే సంథ్యా థియేటర కు వెళ్లానని తెలిపాడు అల్లు అర్జున్. తాను సినిమా చూడటానికి థియేటర్ రావద్దా? అని పోలీసులకు అల్లు అర్జున్ ప్రశ్నించి నట్లు తెలుస్తుంది. ఎవరైన సినిమాకు వెళ్లొచ్చు కదా? నా సినిమాను స్వయంగా అభిమానుతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని థియేటర్ కు వెళ్లినట్లు అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తుంది.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
కానీ ముందుగా తనకు అనుమతి ఉందని, మా పీఆర్ టీం అనుమతి కోరిందని, సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అనుమతి కోరింది కదా అందుకే వచ్చానని అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే సంధ్యా థియేటర్ పర్మిషన్ ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఆ కాపీని అల్లు అర్జున్ ముందు పెట్టారు పోలీసులు. సంధ్యా థియేటర్ కు సెలబ్రెటీల రానున్న.. వచ్చిన రిక్వెస్ట్‌ను రిజక్ట్ చేశామన్న కాపీని కూడా అల్లు అర్జున్ ముందు ఉంచారు పోలీసులు.
Read also: Advocate Varma: సంధ్యా థియేటర్ ఘటనపై సీన్ రీ కన్స్‌ట్రక్షన్.. లాయర్ ఏమన్నారంటే ?
రిజెక్ట్ చేసిన ఎందుకు వచ్చారు? అని అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు. దీంతో అల్లు అర్జున్ అడ్డంగా బుక్ అయిపోయాను అనుకున్నాడో ఏమోగానీ.. ఒక్కసారిగా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. తొక్కిసలాట జరిగిన 10నిమిషాల వీడియోను అల్లు అర్జున్‌కు విచారణ అధికారులు చూపించారు. దీనిపై కూడా అల్లు అర్జున్ మౌనం వహించినట్లు తెలుస్తుంది. ఇక విచారణ ఇంకా కొనసాగుతుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలను అల్లుఅర్జున్ కు పోలీసులు చూపిస్తూ విచారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ మౌనంపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.
https://www.youtube.com/live/xoFYmZNjxlw